PM Kisan Samman Nidhi: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోట్లాది మంది రైతులకు ప్రయోజనంగా మారింది. మూడు దఫాలుగా ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లో ఆరు వేల రూపాయల చొప్పున జమ అవుతున్న విషయం తెల్సిందే. నాలుగు నెలలకు ఒక సారి చొప్పున రూ.2 వేలు రైతులకు ఇస్తున్న మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆ మొత్తంను 50 శాతం వరకు పెంచబోతుందట. భారీ మొత్తం లో ప్రభుత్వం పై వ్యయం పడుతుంది. అయినా కూడా మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర ప్రభుత్వ వర్గాల వారు పేర్కొన్నారు. ఇక పై ప్రతి నాలుగు నెలలకు గాను రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.3 వేల చొప్పున జమ చేయబోతున్నట్లుగా ప్రముఖ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొనడం జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటి వరకు అధికారికంగా ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ రైతులకు లాభం చేకూర్చే విధంగా మోడీ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. అలాగే మరో ఆరు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. కనుక ఈ సమయంలో రైతుల కోసం కిసాన్‌ నిధి పథకం నగదును పెంచడం ద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి. అందుకే మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలే ఎక్కువ అన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు పలుసార్లు వ్యాఖ్యలు చేయడం జరిగింది. 


Also Read: Wireless Speakers With Earbuds: వైర్‌లెస్ స్పీకర్స్, ఈయర్‌బడ్స్.. సరికొత్త ఫీచర్


పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇచ్చ నగదు రూ.2 వేల నుండి రూ.3 వేలు పెంచడం ద్వారా ప్రభుత్వం పై దాదాపుగా 30 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడబోతున్నట్లుగా ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఆ మొత్తం ను సర్ధుబాటు చేసే విధంగా చర్యలు తీసుకుని ఆ తర్వాత అధికారికంగా ప్రకటించాలని కేంద్ర ఆర్థిక శాఖ మరియు వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు ఈ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మరియు పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం కోసం రైతుల సాయం నగదును పెంచాలని నిర్ణయించుకుందనే వార్తలు జాతీయ మీడియాలో వస్తున్నాయి.


Also Read: YS Sharmila: చిలక పలుకులు పలుకుతున్న కవితమ్మ.. ఎక్కడ పాయె మీ చిత్తశుద్ధి..?: వైఎస్ షర్మిల  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి